# Tags

పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంబించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,జిల్లా కలెక్టర్

(తెలంగాణ రిపోర్టర్ ):రాజన్న సిరిసిల్ల జిల్లా…. (సంపత్ కుమార్ పంజ)
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని పత్తి రైతులు ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి, సంకేపల్లి, కోనరావు పేట మండలం సుద్దాలలో ఏర్పాటుచేసిన సి.సి.ఐ. పత్తి కొనుగోలు కేంద్రాలను ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదన కలెక్టర్ ఖీమ్యా నాయక్ సోమవారం హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. పత్తి రైతులు దళారులకు తమ పంటను విక్రయించవద్దని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటికే 200 పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. తేమ శాతం సరిగ్గా ఉన్న ధాన్యాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ధాన్యం నిల్వలకు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆపేరల్ పార్క్ వద్దన గోదాములను పరిశీలించామని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని తెలిపారు. మిగతా రైతులకు కూడా సాంకేతిక సమస్యలతో రుణమాఫీ నిలిచిపోయిన వారి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. రైతు భరోసా కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నామని తెలిపారు. జిల్లాలో పత్తి పండించిన రైతులు 8 నుంచి 12 శాతం తేమతో  తమ పరిధిలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తరలించి విక్రయించాలని పేర్కొన్నారు.ఎన్ని శాతం తో ఏమన్నా పత్తి క్వింటాల్ కు 7,521 రూపాయలు, అలాగే 8 నుంచి 12 శాతం లోపు ఉన్న పత్తికి
7,200 నుంచి 7,445 మద్దతు ధరగా సీసీఐ నిర్ణయించిందని తెలిపారు. దీంతో రైతులకు తూకం విషయంలో అలాగే డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. అలాగే ఇల్లంతకుంట మండలంలో సిసిఐ ఆధ్వర్యంలో రెండు పత్తికొండ కేంద్రాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. రైతులను రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ సీజన్ ముగిసిన తర్వాత రైతుల పొలాలలోని మట్టి పరీక్షలు చేయించి దానికి అనుగుణంగా విత్తనాలు ఎంపిక, ఎరువుల వాడకం త్వరలో చేయిస్తామని తెలిపారు.