# Tags
#తెలంగాణ #Culture

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువజామునే స్ధానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.అనంతరం స్వామివారి పల్లకి సేవ, పెద్ద సేవలో పాల్గొని తరించారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహోత్సవ విశిష్టత ప్రవచన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం, స్వామివారి ఉత్సవ మండపంలో ఆలయ అర్చకులు, వేదంపండితులు ఆశీర్వచనములందించి, స్వామివారి ప్రసాదములందించారు.