# Tags

త్రివేణి సంగమంలో పుష్కర స్నానాన్ని ఆచరించిన   గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దంపతులు-మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు ఆదివారం సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

హైదరాబాద్ నుండి  ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం  పలికారు.

త్రివేణి సంగమంలో పుష్కర స్నానాన్ని ఆచరించిన  అనంతరం  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దంపతులు సరస్వతి ఘాట్ లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం సరస్వతి మాత ఏక శిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు.

పుష్కర స్నానానంతరం గవర్నర్ దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ డైరెక్టర్  వెంకట్ రావు  స్వాగతం పలుకగా, ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.

గవర్నర్ దంపతులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం అందించి,శ్వేత వస్త్రం, ప్రసాదం, మరియు అమ్మవారి జ్ఞాపికను బహుకరించారు. 

ఈ సందర్భంగా. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రతి రోజూ, సాయంత్రం నాది వద్ద నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమాన్ని వివరించారు. 

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 11 రోజుల నుండి వైభవంగా జరుగుతున్న పుష్కరాల సందర్బంగా , భక్తులకు ఎలాంటి ఇబ్బందులు   రాకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు, పుష్కర ఏర్పాట్లను గవర్నర్ పరిశీలించి అధికారులను అభినందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయమని కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *