#ఎడ్యుకేషన్ & కెరీర్

ఆల్ఫోర్స్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

జగిత్యాల కృష్ణానగర్ ఆల్ఫోర్స్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

విద్యార్థులకు బాల్య దశనుండే పలు విషయాల పట్ల అవగాహన కల్పించాలని, తద్వారా పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కృష్ణానగర్ ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్లో ఆల్ఫోర్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరై, పిల్లలను అభినందించారు.

ఈ సందర్భంగా డా.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రాథమిక విద్య చాలా విలువైనదనీ… భవిష్యత్తుకు అదే పునాది అన్నారు. ఇలాంటి అంశాలను పిల్లల్లో అవగాహన కల్పించడం ద్వారా, చిన్నతనంలో వాటిని గ్రహించే శక్తి చాలా ఉంటుందని అన్నారు. ఈ దిశలో వారి మేధోశక్తిని పెంపొందించాలని, ఇందుకుగాను ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. కేవలం తరగతి గదిలో విషయాలు కాకుండా ఇతర విషయాల పట్ల విశ్లేషించి కూడా అవగాహన కల్పించాలన్నారు.

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం యూకేజీ పూర్తి చేసిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు ప్రధానం చేసి ఘనంగా సత్కరించి, మూడో తరగతి ప్రవేశం కల్పించడం జరుగుతుందని వివరించారు. అర్హత పత్రాలను పొందడానికి వారికి వివిధ రకాల మరియు మౌఖిక పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. దీనిద్వారా వారిలో ఉత్సాహం కలుగుతుందని మరియు ప్రేరణ కల్పిస్తుందని చెప్పారు.

ప్రధాన మహోత్సవంలో భాగంగా విద్యార్థులకు ఆలపించిన ప్రత్యేక పద్యాలు గీతాలు రైమ్స్ ఉత్సాహాన్ని పెంపొందించాయి.సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *