# Tags
#తెలంగాణ

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా : (sampath. p):

స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వీరుడు, మాజీ మంత్రివర్యులు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపల్లి దేవాంతం, ప్రధాన కార్యదర్శి వనం రమేష్, ఉపాధ్యక్షులు గోష్కే దేవదాస్ , శ్రీరాం సుదర్శన్, కోశాధికారి వనం బాలరాజు, సంయుక్త కార్యదర్శి రాపల్లి అంబదాస్, యూత్ అధ్యక్షులు సుంకి భాస్కర్, సభ్యులు పాల్గొన్నారు.