# Tags
#తెలంగాణ

బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా…

ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10 గంటల నుండి 03 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని,అందులో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమనికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 12 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.