#తెలంగాణ #జగిత్యాల

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం- మొదటి రోజు ప్రశాంతం 

జగిత్యాల:

– పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ 

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం కాగా, మొదటిరోజున రెండు సెషన్స్ లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

జిల్లాలోని కోరుట్లలో అరుణోదయ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాటు జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ కాలేజ్ , జేఎన్టీయూ కళాశాలను ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ బి,సత్య ప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు.

కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఆదివారం ఉదయం సెషన్ లో జరిగిన  పరీక్షకు జిల్లాలో మొత్తం 10,907 మంది అభ్యర్థులకు గాను, 5274 మంది హాజరు కాగా, 5633 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు.

https://public.app/video/sp_fq02adffmwfvo?utm_medium=android&utm_source=share

అలాగే, మధ్యాహ్నం సెషన్ కు 5222 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారని కలెక్టర్  వివరించారు.

ఆది, సోమవారాలలో ఉదయం, మధ్యాహ్నం చొప్పున మొత్తం నాలుగు సెషన్లలో జరిగే గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *