# Tags
#తెలంగాణ

గురుపూజ తన్మయత్వం : శ్రీరంగం రామాచార్యులు

గురుపూజ తన్మయత్వం
గురువు అంటే నడిచే విజ్ఞాన గని..
నిత్య చైతన్య స్ఫూర్తితో వెలుగొందే భాను తేజోమయుడు గురువు!
అమ్మ ఆదిగురువు అయితే,
నాన్న నడక నేర్పుతూ, గురుతరమైన భావాలను వెల్లడించే ఆనంద మయుడు నాన్న!

బాహ్య ప్రపంచ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ, గురువు తానే విద్యార్థిగా శోధిస్తూ,
పుస్తక పరిచయం చేస్తూ,
పదునైన అక్షర బీజాలను
విద్యార్థుల మస్తిష్కాల్లో ఎక్కించే ప్రత్యక్ష దైవం గురువే,
బిడ్డ ఎంత ఎత్తు ఎదిగితే కన్నవారు ఎంతగా ఆనంద పడుతారో, అలాగే శిష్యులు ప్రయోజకులు అయితే గురువు అంతే ఆనంద పడుతూ, ఇంకా మహోన్నత శిఖరాలకి చేరుకోవాలని దీవించే నిస్వార్థ ధన్యజీవి గురువే సుమా!

  • నా ప్రియ శిష్యుడైన శంకర్ చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకొని ఎంతో ఓర్పు నేర్పు సమయ స్ఫూర్తితో రాణిస్తూ, అకుంఠిత దీక్షతో మనసును భగవంతుని పైన ద్యాసగా పెట్టి,
    18 పర్యాయాలు శబరి కొండకు చేరుకొని
    మణికంఠ అనుగ్రహం పొంది
    గురు స్వామిగా పిలువబడే శంకర్ నిజంగా ఆ పరమాత్ముడే అని భావిస్తూ,

    భగవంతున్ని పరిచయం చేసిన గురువును భక్త జనుల నడుమ సన్మాన సత్కారాలు అందించడం, గురువుగా స్వీకరించడం ఎంతో నయనానందకరంగా ఉంది.
    నా శిష్యుడు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ చిరంజీవి శంకర్ కి ఇవే మా అక్షర నీరాజనాలు…..
  • – శ్రీరంగం రామాచార్యులు