# Tags

వికలాంగుల జీవితాలను మార్చడానికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి హెలెన్ కెల్లార్ :మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ :

హెలెన్ కెల్లార్ 145 జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మలక్ పేట నల్గొండ x రోడ్ వద్దగల దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జండర్ వ్యక్తుల సాధికారత శాఖ వారి ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హెలెన్ కెల్లార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు,అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..హెలెన్ కెల్లర్ 145 జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని,చెవిటి మరియు అంధురాలు అయిన గొప్ప అమెరికన్ మహిళ హెలెన్ ఆడమ్స్ కెల్లర్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరియు వారిని గౌరవించుకోవడానికి ప్రతి సంవత్సరం జూన్ 27న హెలెన్ కెల్లర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.

ఆమెకు వైకల్యాలున్నప్పటికీ తను ప్రసిద్ధ రచయిత్రి,రాజకీయ కార్యకర్త మరియు లెక్చరర్ అయ్యారనీ మరియు ఆమె జీవితం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్పూర్తిదాయకమన్నారు.

ఆమె ఎదుర్కొన్న పోరాటాలు మరియు ధైర్యం,సంకల్పం మరియు ఆమె గురువు అన్నే సుల్లివన్ మద్దతు ద్వారా ఆమె సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.హెలెన్ కెల్లర్ వికలాంగుల జీవితాలను మార్చడానికి ఎంతో కృషి చేశారనీ,

హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో. ..వైకల్యాలతో జీవిస్తున్న వారికి అండగా ప్రతి ఒక్కరూ ఉండాలని,ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందనీ ఈ సందర్భంగా వివరించారు.