# Tags
#తెలంగాణ #జగిత్యాల

హలో మాదిగ ఈనెల 27న చలో జగిత్యాల

(తెలంగాణ రిపోర్టర్ )

ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ సభనుమాదిగ మాదిగ ఉపకులాలు విజయవంతం చేయాలని పిలుపునిస్తూ

ఎస్సీ వర్గీకరణను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని,

ఈనెల 27న జగిత్యాల జిల్లాలో జరిగే ధర్మ యుద్ధ మహాసభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే ఉద్యోగ విద్య అవకాశాల్లో చేయాలని లేదంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షులు కానాపురం రక్షణ మాదిగ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ జగిత్యాల జిల్లాలో నిర్వహించే ధర్మ యుద్ధ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఈ సభను విజయవంతం చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల మాదిగ మాదిగ ఉప కులాలుఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు మేధావులు నిరుద్యోగులు విద్యార్థులు మహిళలుఅన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
శ్రీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో మొదటగా అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీని విస్మరించారని ఇప్పటికే పాలు రాష్ట్రాలలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణను అమలు చేస్తున్నారని తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు..