# Tags

బీసీ బంద్ కు మద్దతుగా భారీ మోటర్ సైకిల్ ర్యాలీ

చిగురుమామిడి (కనకయ్య ముడికే):

చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ జేఏసీ బంద్ కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో బీసీ చైతన్య  ర్యాలీ నిర్వహించారు.

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 150 మోటర్ సైకిల్లు మండల కేంద్రం నుండి బయలుదేరి అన్ని గ్రామాలలో తిరుగుతూ బీసీ చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చూడాలన్నారు.

ఏ రాజకీయ పార్టీ ఐన, ఏ నాయకుడైన బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తే రాజకీయంగా పాతర వేయడం ఖాయమన్నారు. బీసీల భవిష్యత్తు కోసం, జాతి అభివృద్ధి కోసం, ఆత్మ గౌరవం కోసం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.


ఈనెల 18న రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు విద్యా ఉద్యోగ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బందులు పాటించాలని విన్నవించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు శ్రీ రామోజీ రాజ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్ల పెళ్లి తిరుపతి గౌడ్, మండల యూత్ అధ్యక్షులు గుడిసె మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి గట్టు ప్రశాంత్, పెసరి శ్రీనివాస్, ముంజ వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షులు శిరవేణి సంపత్, బరిగల సదానందం, మూసాపూరి సంపత్, పెసరి మొగిలి, పిల్లి కొమురయ్య, కందుకూరి శ్రీనివాస్, బింగి రాజేంద్రప్రసాద్, గుడిసె ఓదేలు, కూన తిరుపతి, దంచనోజుచంద్రశేఖర్ ,మండల నాయకులు మూల శ్రీనివాస్, కూరల కిషోర్, చొప్పదండి సాయి, పొన్నం రాజు, నల్గొండ దశరథం, పిట్టల రాజు తదితరులు పాల్గొన్నారు.