# Tags
#తెలంగాణ

షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం .

ఎల్లారెడ్డిపేట:

  • వీధిన పడిన కుటుంబం
    (తెలంగాణ రిపోర్టర్)
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దేవుని గుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలో అంగోతు రాములు పూరిగుడిసే షార్ట్ సర్క్యూట్ తో బుధవారం తెల్లవారుజామున పూర్తిగా దగ్ధమైంది ఈ సందర్భంగా పూరి గుడిసెలో నివాసముంటున్న గిరిజన రైతు అంగోతు రాముల కుటుంబం పూర్తిగా వీధిన పడినట్లు అయింది కనీసం కట్టుబట్ట తినటానికి ఏ మాత్రం ధాన్యం లేకుండా వంట పాత్రలు పూర్తిగా కాలిపోవడం జరిగిందని బాధితుడు బోరున విలపించారు. బాధితుడు రాములు భార్య కైక,కుమారుడు గణేష్ చదువుకున్న సర్టిఫికెట్లు కూడా దగ్ధమయ్యాయని అన్నారు.అప్పటికి అగ్నిమాపకదల యంత్రం రావడంతోనే మంటలను ఆర్పి వేసినట్లు తండా నాయకుడు నవీన్ తెలిపారు.ఈ మేరకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం, వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,గంట బుచ్చగౌడ్,మిండేటి శ్రీనివాస్ బాధితులతో మాట్లాడి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని అన్నారు.50 కేజీల బియ్యాన్ని కుటుంబానికి పంపించారు.విషయం తెలుసుకున్న సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి వారి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానన్నట్లు తెలిపారు.