# Tags

ఆత్మ త్యాగానికైనా వెనకాడబోను : బిజెపిజిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా

  • రాజన్నకు చేసే పూజలు భీమన్నకు ఎలా చేస్తారు..?
  • గర్భగుడిలోనే స్వామి వారికి నిత్యం పూజ కార్యక్రమాలు నిర్వహించాలి
  • రాజన్న ఆలయ పునర్నిర్మాణం పేరుతో విగ్రహాలను తొలగిస్తే ఊరుకునేది లేదు
  • పునర్నిర్మాణం కాదు… భక్తులకు కనీస వసతులపై దృష్టి పెట్టండి
  • గర్భగుడిలోనే స్వామి వారికి నిత్యం పూజ కార్యక్రమాలు నిర్వహించాలి

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం పేరుతో ఆలయంలో ఉన్నటువంటి ఏ ఒక్క విగ్రహాన్ని తొలగించినా, తాను ఆత్మ త్యాగానికైనా వెనకాడబోనని జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం రాత్రి పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజన్నకు చేసేటటువంటి పూజా కార్యక్రమాలు భీమన్న ఆలయంలో ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.

తాను అభివృద్ధికి అడ్డుపడట్లేదని, అభివృద్ధి చేస్తే పక్కనే ఉన్నటువంటి 30 ఎకరాల్లో ఆలయ అభివృద్ధిని విస్తరించాలని ఆయన సూచించారు.

ఆలయ పునర్నిర్మాణం కాదు.. ముందుగా రాజన్న దర్శనం కోసం, మొక్కులు తీర్చుకోడం కోసం వచ్చే భక్తులకు కనీస వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

రాజన్న కోడెలకు సరైన సంరక్షణ లేక మృత్యువాత పడుతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, అధికారులు స్పందించి రాజన్న ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినా కూడా, గర్భగుడిలోనే స్వామి వారికి నిత్యం పూజ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.