# Tags
#జగిత్యాల

జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అటవీశాఖ ఉద్యోగులు, టింబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

జగిత్యాల

జగిత్యాల జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది మరియు టింబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు తో పాటు ఎఫ్ఆర్ఓ ప్రణీత్ కౌర్, డిఆర్ఓ అరుణ్ కుమార్, బీట్ ఆఫీసర్ మహమ్మద్ ఫిరోజ్ అలీ, అటవీశాఖ ఉద్యోగులు, అటవీశాఖ ఉద్యోగ సంఘ నాయకులతో పాటు టింబర్ అసోసియేషన్ సంఘ నాయకులు, పలువురు ముస్లిం పెద్దలు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సతీష్, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు టివి సత్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు .

ఈ సందర్భంగా ప్రార్థనల అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పవిత్ర మాసం నిలుస్తుందని అన్నారు. ఈ పవిత్ర మాసం నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ, పేదలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుండడం ఒక మంచి మార్గానికి నిదర్శనం అన్నారు. ఇఫ్తార్ విందుల ద్వారా అందరి మధ్య సోదర భావం ఏర్పడుతుందని, ఎలాంటి బేధ భావాలు లేకుండా రంజాన్ పవిత్ర మాసం సన్మార్గంలో వారిని తీసుకువెళుతుందన్నారు.

రంజాన్ నెలలో  వీలైనంత  దాన ధర్మాలు చేయాలనికోరారు  భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, సంస్కృతిని పాటిస్తూ, సోదర భావాన్ని పెంపొందించాలని అన్నారు.