# Tags

జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు: జిల్లా ఎస్.పి. శ్రీమతి సిహెచ్. సింధు శర్మ

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు జిల్లా ఎస్.పి. శ్రీమతి సిహెచ్. సింధు శర్మ

(తెలంగాణ రిపోర్టర్ ) కామారెడ్డి …


కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ( అక్టోబర్ 1వ తేది నుండి 07 వ తేదీ వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్.పి. సిహెచ్.సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపారు.