#తెలంగాణ

ఈ ఎన్నికలలో 12 పార్లమెంట్ స్థానాల్లో విజయం మాదే : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ :

-మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం

-వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడితే కఠిన చర్యలు

రానున్న లోకసభ ఎన్నికలలో 12 స్థానాల్లో విజయం మాదే అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. 

శనివారం హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

కావాలనే తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పూరితంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తుంన్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 12 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

త్వరలో రైతులకు బోనస్ అందజేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా వరి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడంపై విధి విధానాలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుందనీ.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని శ్రీధర్ బాబు అన్నారు. 

కాగా రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయనున్నట్లు వెల్లడించారు.

అలాంటి వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నారు. కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు.. అలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని… రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *