# Tags
#world #Events #People #అంతర్జాతీయం #జాతీయం

భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్ – రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ

భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్

భారత్ పర్యటనలో భాగంగా కుదిరిన ఒప్పందాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. ‘భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. భారత్-రష్యా మధ్య 64B డాలర్ల వ్యాపారం జరుగుతోంది, దీన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఆయిల్, అణువిద్యుత్, విద్యుత్, మెడిసినల్ డ్రగ్స్ రంగాల్లో ఇండియాతో కలిసి పనిచేస్తాం’అని వెల్లడించారు.

రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ

భారత్, రష్యా స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పుతిన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశంగా ఉంది. యూరియా ఉత్పత్తికి సహాయం చేస్తోంది. 2030 వరకు భారత్- రష్యా మధ్య ఎకనమిక్ ప్రోగ్రాం కుదుర్చుకున్నాం. ఆర్థిక రంగంలో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్తాం. భారత్కు వచ్చే రష్యా పర్యాటకుల వీసాల నిబంధనలు సరళీకరిస్తాం’ అని మోదీ తెలిపారు.

భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు :

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. వైద్య, ఆరోగ్య రంగాల్లో సహకారం, వలస విధానంపై పరస్పర సమన్వయం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ సరఫరా, సముద్ర ఆహార ఉత్పత్తుల వాణిజ్యంపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలను PM మోదీ, పుతిన్ సమక్షంలో నిర్వహించారు. వీటితో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలో పేతం కానున్నాయి.