# Tags
#తెలంగాణ

దుకాణాలు, హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు

రాయికల్‌ : ఎస్. శ్యామ్ సుందర్

రాయికల్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది బుధవారం పలు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ప్లాస్టిక్ వినియోగిస్తున్న మరియు విక్రయిస్తున్న వ్యాపారస్థులకు జరిమానాలు విధించడంతో పాటు, సరఫరా చేస్తున్న వాహనంలో ఉన్న ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అదనంగా, హోటళ్లు మరియు రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ డి. సురేష్, జవాన్ వినయ్ మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.