#తెలంగాణ #జగిత్యాల

జగిత్యాల జిల్లాలో అంతర్ జిల్లా దొంగ అరెస్ట్, 25 లక్షల విలువగల 28.6 తులాలు బంగారు ఆభరణాలు స్వాదీనం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా :

పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు పాల్పడ్డ జగిత్యాల జిల్లా రాజారం గ్రామంకు చెందిన బక్క శెట్టి కొమరయ్య @ రేగుల అజయ్ కుమార్ బుధవారం పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడని జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ వెల్లడించారు.

గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.  

 తేదీ 09-04-2025 రోజున జగిత్యాల పట్టణ పోలీస్ వారు కొత్త బస్టాండ్ లో చౌరస్తా ఏరియాలో వాహన తనిఖీ చేస్తుండగా బుధవారం సాయంత్రం 06 గంటల ప్రాంతంలో  అనుమానస్పద స్థితిలో తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని విచారించగా అతని వద్ద బంగారు నగలు పట్టుబడ్డాయనీ, పూర్తి విచారణ చేసి అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ వెల్లడించారు. పోలీస్ లకు పట్టుబడ్డ బక్క శెట్టి కొమరయ్య @ రేగుల అజయ్ కుమార్ జగిత్యాలలో పలు దొంగతనాలకు పాల్పడి బంగారు ఆభరణాలు మరియు నగదు ఎత్తుకెళ్లినాడని వివరించారు.

Inter-district thief arrested in Jagtial district, 28.6 tolas of gold ornaments worth Rs 25 lakh recovered: District SP Ashok Kumar

ఆయా దొంగతనాల కేసులలో  మొత్తం బంగారం – 286.570 గ్రాములు(28.6 తులాలు) విలువ సుమారు 25,00,000/- రూ।।  ఉంటుందని ఎస్పీ ఆశోక్ కుమార్ వెల్లడించారు.

ఈ దొంగను పట్టుకొని అతని వద్ద నుండి దొంగ సొత్తును రికవరీ చేయడానికి ప్రతిభ కనబరిచిన జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, SI లు కిరణ్, గీత, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ లు విశాల్, జీవన్, మల్లేష్ ,గంగాధర్, సంతోష్, రాజిరెడ్డి, లను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ రివార్డు అందజేసి అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *