# Tags
#తెలంగాణ #హైదరాబాద్

రైతుల పరిహారం కోసం డిమాండ్ చేసినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ :

కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించాలని పెద్దపెల్లి జిల్లా రాఘవాపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో రైతుల పరిహారం కోసం
డిమాండ్ చేసినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం నాడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు.

2017 లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు ఆయనతోపాటు హర్కర వేణుగోపాల్, అన్నయ్య గౌడ్, శశిభూషణ్ కాచె, మరో 9 మంది బ్లాక్ కాంగ్రేస్ అద్యక్షులు తిరుపతి యాదవ్,సింగిల్ విండో ఛైర్మన్ కొత్త శ్రీనివాస్,చోప్పరి సదానందం,ఉప్పట్ల శ్రీనివాస్, ఈర్ల కోంరయ్య,పోలు శివ,సెగ్గంరాజేష్,పోతరవేన క్రాంతి, ఇనుముల సతీష్ లపై

 కేసులు పెట్టారు. విచారణలో భాగంగా స్పెషల్ జేయంఎఫ్సి కోర్టులో న్యాయమూర్తి ఎస్.శ్రీ దేవి గారి ముందు విచారణకు హాజరైనారు. శాంతియుతంగా ఆందోళన చేసినా అప్పటి ప్రభుత్వం ఐపీసీ 147, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు పెట్టింది.