# Tags

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి

జగిత్యాల జిల్లా :

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గత వారం క్రితమే బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు.

2030 లో రిటైర్ అవ్వబోయే ఆయన హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. డా శ్రీనివాస్ కు విద్యాభ్యాసంలోనే ఉండి వివాహం కాని ఇద్దరు

ఆడపిల్లలు ఉన్నారు. 

వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రజారోగ్య రంగంలో అంకితభావంతో పనిచేస్తూ, బాధ్యతాయుత అధికారిగా మంచి గుర్తింపు పొందిన శ్రీనివాస్ మరణం వైద్య శాఖకు తీరని లోటుగా వారు పేర్కొన్నారు. 

https://publicapp.co.in/video/sp_dosdixhef4s8x?share=true

శనివారం ఉదయం ఈ విషాద వార్త వెలువడగానే కలెక్టరేట్ సిబ్బంది, వైద్య విభాగ సహచరులు, మిత్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. 

ఆయనతో కలిసి పనిచేసిన పలువురు అధికారులు భావోద్వేగానికి లోనయ్యారు, సేవాభావంతో మానవీయ విలువలతో విధులు నిర్వహించిన వ్యక్తిగా డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఎప్పటికీ గుర్తుండిపోతారని పలువురు అభిప్రాయపడ్డారు.