#తెలంగాణ #Events #జగిత్యాల

మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలాంటిది జగిత్యాల SKNR ఆర్ట్స్&సైన్స్  కళాశాల : ప్రిన్సిపాల్ డా. అశోక్ 

జగిత్యాల :

విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం

జగిత్యాల పట్టణ మరియు సమీప గ్రామాలలోని గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యలో అవకాశం కల్పించడం, ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడమే కళాశాల లక్ష్యంగా జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం తమవంతు కృషి చేస్తుంది.

ఇందులో భాగంగా,  2007లో రెండు PG కోర్సులు MA మరియు M.Com ప్రారంభించబదిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ కళాశాలలో ప్రస్తుతం డిగ్రీ, పిజి విద్యార్థులు సుమారుగా 600 మంది విద్యార్థులు విద్యాభ్యాసం  చేస్తున్నారు.

కాగా, ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికిగాను కళాశాల ప్రిన్సిపాల్ డా. అరిగెల అశోక్ ఆధ్వర్యంలో, వైస్ ప్రిన్సిపాల్ డా.ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలవారిని కలిసి వారి వారి పిల్లలను జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో చేర్పించాలని కోరుతూ…. ప్రత్యేకంగా  ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా, మంగళవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో కళాశాలనుండి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా వారు కళాశాలలో ఉన్న వసతులు, మంచి విద్యను అందించేందుకు అధ్యాపకబృందం, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, క్రీడా సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు. పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలాంటిది జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల అని పేర్కొన్నారు.

తమ అధ్యాపక బృందమైన ncc కో ఆర్డినేటర్, జువాలజీ విభాగం పి. రాజు, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. GVR సాయిమధుకర్, పి.జి కో ఆర్డినేటర్, కామర్స్ విభాగం అంకం గోవర్ధన్, లైబ్రరియన్ కే. సురేందర్ తో పాటు పలువురు పట్టణ మరియు సమీప గ్రామాలలో  పర్యటించి, అన్ని హంగులున్న SKNR ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన చేపడతారని వివరించారు.

ఇంకా, కళాశాలకు సుమారు 32 ఎకరాలకు పైగా భూదాత శ్రీ కాసుగంటి నారాయణరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కాసుగంటి ట్రస్ట్ పేరిట, రాష్ట్ర బార్ కౌన్సిలర్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ నేత్రుత్వంలో ప్రతీ సంవత్సరం నాలుగు విభాగాలలో ప్రథమ స్థానం పొందిన నలుగురు విద్యార్థులకు సుమారు 2 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందడం హర్షనీయమని కళాశాల పూర్వ విద్యార్ధి, అలుమ్ని సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ అన్నారు. గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఎంతగానో ప్రోత్సామునిస్తుందన్నారు.

కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.అరిగెల అశోక్, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆడెపు శ్రీనివాస్ లతోపాటు అధ్యాపక బృందం మరియు కళాశాల పూర్వ విద్యార్ధి, అలుమ్ని సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, సిబ్బంది కందుకూరి శ్రీనివాస్, వేణు, గణపతి, ప్రమోద్, దివ్యరాణి, స్వరూప, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో....

కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం  పరిధిలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 ప్రయోగశాలలు, విశాలమైన లైబ్రరీ, అధునాతన వర్చువల్ తరగతి గది, 14 మంచి వెంటిలేషన్ తరగతి గదులు, అధునాతన వ్యాయామశాల, ఇండోర్ స్పోర్ట్స్ కోర్ట్‌లు, బొటానికల్ గార్డెన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ మరియు TSKC ల్యాబ్ ఉన్నాయి. కళాశాలలో సామాజిక సేవ అందించే ఒక NCC యూనిట్ మరియు రెండు NSS యూనిట్లు ఉన్నాయి.

కళాశాల 2006-2007లో NAAC ద్వారా “B’ గ్రేడ్‌ను పొందినా ఈ కళాశాల పచ్చదనాన్ని పెంచే ప్రభుత్వ  కార్యక్రమం హరితహారంలో కళాశాలకు రాష్ట్ర ఉత్తమ సంస్థ అవార్డు లభించింది.

ప్రస్తుత ప్రపంచ మార్కెట్ యొక్క పెరుగుతున్న అవసరాలను తీర్చే విధంగా, భవిష్యత్ తరాల దృష్ట్యా, రెండు పునర్నిర్మాణ కోర్సులు B.Sc. (గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్), B.Com. (కంప్యూటర్ అప్లికేషన్స్), అందిస్తున్నారు. 

 కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ వంటి సర్టిఫికేట్ కోర్సులను అందిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *