#జగిత్యాల

సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్, అదనపు కలెక్టర్

జగిత్యాల:

గురువారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో స్థానిక టౌన్ హల్ నందు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, MPDOలు, MPOలు, మున్సిపల్ కమీషనర్ లు, మున్సిపాలిటీ హెల్త్ (AEs, DEs) లు, మిషన్ భగీరథ అధికారులతో జిల్లా కలెక్టర్  యాస్మిన్ బాషాస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి ఎస్ దివాకర తో కలిసి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీలు,5 మున్సిపాలిటీ ల యందు ఎండాకాలంలో ఎటువంటి త్రాగు నీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.ప్రతి గ్రామపంచాయతీ నందు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఏవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాల నందు ప్రతిరోజు రెండుసార్లు గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోయించాలని, మొక్కలు చనిపోకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. 

అదేవిధంగా వరి  ధాన్యంకొనుగోలు కేంద్రాలు  నందు కూడా వచ్చే రైతులకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా పంచాయతీ అధికారి  ఓ దేవరాజ్, సీఈఓ రఘువరన్, డి ఆర్ డి ఓ సంపత్ రావు, ఈ  ఈ rws సతీష్, జిల్లా స్థాయి అధికారులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు  పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *