# Tags

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిలువెత్తు బెల్లంతో తులాభారం సమర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ :

పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గురువారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహేంద్ర బాబు జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ 2023లో గెలుపొందాలని వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకోగా, గురువారంఉదయం11-30 గంటల ప్రాంతంలో ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ నిలువెత్తు బెల్లం జోకి తులాభారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రాయికల్ పట్టణ అభివ్రుద్ది కి నిరంతరం కృషి చేస్తానన్నారు…

ముఖ్యమంత్రి 5కోట్ల SDF నిధులు మంజూరు చేయటం జరిగింది..రాయికల్ పట్టణ అభివృద్ధి కి నిధులు కేటాయిస్తానన్నారు.రాయికల్ పట్టణ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివ్రుద్ది కి నిధులు మంజూరు చేస్తాననీ, హనుమాన్ ఆలయం,గుడి కోట ఆలయ అభివ్రుద్ది కి నిధులు మంజూరు చేయటం జరిగిందని వివరించారు.

అన్నివర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తా అన్నారు.
మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలి అన్నారు ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు పడిగల రవీందర్ రెడ్డి కోల శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ ఆలయ ఛైర్మెన్ గంగాధర్ మహేంద్ర బాబు మోర రామ్మూర్తి రాయికల్ పట్టణ మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.