# Tags
#తెలంగాణ

బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన జగిత్యాల టీఎన్జీవోలు


జగిత్యాల జిల్లా

కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా జాతీయ పతాకవిష్కరణ కు విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ను టీఎన్జీవో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షులు ఎండి.వకీల్, టీఎన్జీవో నాయకులు రవిచంద్ర, రవిందర్, రాజేందర్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, మమత, శైలజ, శ్రావణి, రాజశ్రీ, విజయలక్ష్మి, ఉద్యోగులు పాల్గొన్నారు.