జితేందర్ రెడ్డి జీవితం స్పూర్తిదాయకంగా మారుతుంది :జితేందర్ రెడ్డి సినిమా నిర్మాత ముదిగంటి రవీందర్ రెడ్డి

జితేందర్ రెడ్డి లాంటి త్యాగశీలి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాలో తనకు అవకాశం రావడం గొప్ప అదృష్టం….

-హీరో రాకేష్….

జగిత్యాల నవంబర్ 5 జితేందర్ రెడ్డి మూవీ రిలీజ్ తర్వాత ప్రతీ ఒక్కరికి అతడి జీవితం స్పూర్తిదాయకంగా మారుతుందని, సమాజానికి ఆయన చేసిన సేవ గుర్తుండిపోతుందని జితేందర్ రెడ్డి సినిమా నిర్మాత ముదిగంటి రవీందర్ రెడ్డి అన్నారు. జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షోను స్థానిక బాలాజీ థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించారు. చరిత్ర లో జరిగిన నిజాన్ని తెలుసుకోవడం అందరి బాధ్యత అని, అలాంటి ఒక నిజాన్ని జితేందర్ రెడ్డి సినిమా ద్వారా ఆయన జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అలాంటిదే అని నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి అన్నారు.

సినిమా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ గతంలో తాను ప్రేమ కథా చిత్రాలు చేశానని, వినోదాన్ని పండించడం తనకు ఇష్టం అని, కానీ వాటితోపాటు భావోద్వేగాలతో కూడిన డ్రామాతో సినిమాలు చేయాలని చూస్తున్నానన్నారు. ఆ సమయంలో జితేందర్ రెడ్డి కథ వినే అవకాశం కలిగిందని, ఆయనకు సంబంధించిన బుక్ చదివిన తర్వాత నేనే ఈ బయోపిక్ను డైరెక్ట్ చేయాలని అనుకొన్నానన్నారు. జగిత్యాల గ్రామానికి వెళ్లి ప్రజలను, ఆయన గురించి తెలిసిన ప్రతీ ఒక్కరితో మాట్లాడి కథపై అవగాహన చేసుకొన్నాను అని విరించి వర్మ చెప్పారు. హీరో రాకేష్ వర్రే మాట్లాడుతూ గతంలో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించానని,

హీరోగా నటించే అవకాశం జితేందర్ రెడ్డి సినిమా ద్వారా నాకు దక్కిందని అన్నారు. జితేందర్ రెడ్డి లాంటి త్యాగశీలి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాలో తనకు అవకాశం దగ్గడం గొప్ప అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి మిత్రులు ఏసిఎస్ రాజు, రాచకొండ శ్రీరాములు, బోయినపల్లి లక్ష్మణరావు, రామలింగారెడ్డి పాల్గొన్నారు.ప్రివ్యూ షో ను జితేందర్ రెడ్డి అభిమానులు, మిత్రులు అధిక సంఖ్యలో వీక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *