# Tags
#తెలంగాణ

టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ కమిటీ సభ్యులుగా కరీంనగర్ కు చెందిన జర్నలిస్టులు

టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ కమిటీ సభ్యులుగా కరీంనగర్ కు చెందిన జర్నలిస్టులు

-బి.జయసింహారావు, ఎన్ మహేంద్ర చారి, ఒంటెల కృష్ణ, ఈద మధుకర్, మారుతి ప్రకాష్ నియామకం

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అనుబంధ కమిటీలను ప్రకటించింది. జర్నలిస్టు రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులుగా బి జయసింహారావు,

ఎన్ మహేంద్ర చారి, సోషల్ అండ్ డిజిటల్ మీడియా క్యాంపెయిన్ కమిటీ సభ్యులుగా ఒంటెల కృష్ణ, రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యునిగా ఈద మధుకర్, జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ కమిటీ సభ్యునిగా చిగురుమామిడి మండలాకి చెందిన మారుతి ప్రకాష్ నియామకం అయ్యారు. హైదరాబాదులోని టియుడబ్ల్యూజె ఐజెయు రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు కే విరహత్ అలీ ప్రతిపాదించగా,రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.