# Tags

TUWJ-143 ఆధ్వర్యంలో తెలంగాణ అమరులకు నివాళులర్పించి, బైక్ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు

రాజన్న సిరిసిల్ల :

ఎందరో అమరుల త్యాగ ఫలితంగా పురుడు పోసుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ-143 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గల అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అమరులైన త్యాగధనులకు ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కొవ్వొత్తులతో తెలంగాణ తల్లి విగ్రహం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే -143 రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ…ఎందరో ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ అమరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.

కార్యక్రమంలో టెంజు జిల్లా అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్, టియుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల గట్టు లతోపాటు యూనియన్ సీనియర్ నాయకులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.