# Tags
#world #Events #People #అంతర్జాతీయం #జగిత్యాల #జాతీయం #తెలంగాణ

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, పాత్రికేయుల ర్యాలీ

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, జగిత్యాల పాత్రికేయుల ర్యాలీ

జగిత్యాల:

భారతప్రభుత్వంచేపట్టిన ఆపరేషన్ సిందూర్ మరియు భారత సైన్యానికి సంఘీభావం తెలిపేందుకు, జగిత్యాల పాత్రికేయులు శనివారం ఉదయం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించింది.

అలాగే, గతనెల 22న పహాల్గామ్ లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో మృతులైన వారికి మరియు పాకిస్థాన్ దాడుల్లో మృతిచెందిన జవాన్ మురళి నాయక్,  రాజా్రి డిప్యూటీ అడిషనల్ కమిషనర్ మృతి పట్ల నివాళులర్పించారు. 

భారతదేశ వీర సైనికుల త్యాగాలను గౌరవించడంతో పాటుగా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, జగిత్యాలపాత్రికేయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. “జై జవాన్, జై కిసాన్” భారత్ మాతాకి జై, వందేమాతరం వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు,దేశాన్ని రక్షించడంలో సాయుధ దళాల 
కీలక పాత్రను ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం యొక్క ధైర్యం మరియు అంకితభావానికి సెల్యూట్ చేశారు. సంఘీభావం మరియు దేశభక్తి సందేశాన్ని మీడియా విస్తృతం చేయాలని జగిత్యాల పాత్రికేయులు కోరారు.

ప్రతిఒక్కరూ భారత దేశ పౌరులుగా భారత ప్రభుత్వానికి,  తలపెట్టిన ఆపరేషన్ సిందూర్ కు దేశ ప్రజలకు వెన్నెముకగా నిలబడుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి, రక్షణవ్యవస్థకు సంఘీభావంగా నిలబడాలని కోరారు.