# Tags
#తెలంగాణ #హైదరాబాద్

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూత

హైదరాబాద్ :

భారాసకు చెందిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఈనెల 5న గురువారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచాని వైద్యులు వెల్లడించారు. ఈనెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు కార్డియాక్ అరెస్టుకు గురై తుదిశ్వాస విడిచినట్లు వెద్యులు తెలిపారు.

మాగంటి గోపీనాథ్ 2014లో తొలిసారి తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో బిఆరెస్ లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లో, గెలిచారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు.