# Tags
#తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి : (తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డి నియోజకవర్గపరిధి దేవునిపల్లి గ్రామంలోని జిల్లాపరిషత్ పాఠశాలను స్థానిక శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం ఆకస్మికతనిఖీ చేసినారు. విద్యార్థులతో మాట్లాడుతూ… సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.ఏదైనా సమస్య ఉంటే చెప్పాలని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి,విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు.