# Tags
#తెలంగాణ #politics

కరీంనగర్ జిల్లా పోరాట సమితి సభ్యులు ముందస్తు అరెస్ట్ – విడుదల

బెజ్జంకి :

హుస్నాబాద్ సీఎం సభకు వెళ్లి, బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్న మానాల రవి, దోనె వెంకటేశ్వర్ రావు తదితరులను బెజ్జంకి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ విషయం తెలుసుకున్న పోరాట సమితి సభ్యులు, మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి పోలీసుల తీరును ఖండించారు. కాగా ముఖ్యమంత్రి బహిరంగ సభ అనంతరం వారిని సాయంత్రం విడుదల చేశారు.

ప్రజాభిప్రాయానికి వ్యతరేకంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న బెజ్జంకి మండలాన్ని సిద్ధిపేట జిల్లాలో నాటి ప్రభుత్వము కలపగా 2016లో “సిద్ధిపేట వద్దు -కరీంనగర్ ముద్దు” అంటూ నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బందులు పాటించినప్పటికీ సిద్దిపేటలో కలిపారు.

అప్పటి నుండి 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో, 23నామినేషన్ లు వేసి నిరసన తెలపడం, కమిటీ సభ్యులు పోస్ట్ కార్డు ఉద్యమం, ప్రెస్ మీట్, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు మండల ప్రజలకు కలిగిన నష్టాలను వివరిస్తూ వినతి పత్రాలను కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్బంగా వారు వాపోయారు.

కాంగ్రేస్ ప్రభుత్వం రాగానే వందరోజుల్లో కరీంనగర్ లో కలుపుతామని హామీ ఇచ్చిన నాయకులు, రెండేళ్లయినా ఆ దిశగా ఆలోచించక పోవడం, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు నాయకుల హామీ పట్ల గుర్రుగా ఉండడముతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి అఖిల పక్షాలను ఏకం చేస్తూ, రానున్న రోజుల్లో దీక్షలకు సిద్దమవుతున్న వేళ వీరిని ముందస్తు అరెస్ట్ చేయడంతో ప్రజలు ప్రభుత్వం పట్ల, పార్టీ నాయకుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.