కర్ర సాముతో ఆత్మరక్షణ-హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాకులు కె. పున్నంచందర్

(తెలంగాణ రిపోర్టర్)రాజన్న సిరిసిల్ల జిల్లా…. సంపత్ కుమార్ పంజ….

హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ కళాశాల మైదానంలో రెండవ విడత కర్ర సాము శిక్షణ శిబిరం ప్రారంభించినట్లు హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాకులు కె. పున్నంచందర్ తెలిపారు.ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతు మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కర్ర సాము శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు.
బాలికలు, మహిళల్లో ఆత్మరక్షణ తో పాటు ఆత్మవిశ్వాసం, మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని అన్నారు.
నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదురించే ధైర్యం కర్ర సాము ద్వారా వస్తుందని తెలిపారు.
ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని మహిళలో నింపడమే లక్ష్యంగా కర్ర సాము శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.మాస్టర్ వడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ…స్వచ్ఛందంగా శిక్షణ ఇచ్చేందుకు హెల్పింగ్ హార్ట్స్ ముందుకు రావడం అభినందనీయం అన్నారు.
నిరంతర శిక్షణా కార్యక్రమంగా కర్ర సాము మహిళల కోసం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మహిళలు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు ఆలువాల ఈశ్వర్ మాట్లాడుతు మహిళలపై దాడులు జరిగినప్పుడు కర్ర ఆయుధంగా ఉపయోగించి రక్షణ పొందే అవకాశం కర్ర సాము కల్పిస్తుందని అన్నారు.హెల్పింగ్ హార్ట్స్ ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల తిరుమల మాట్లాడుతు మహిళలందరూ రుద్రమా దేవి, జాన్సీ లక్ష్మీబాయి లాగ ధైర్యాన్ని కల్గి ఉండాలని అన్నారు.చరిత్రలోని ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహిళల్ని స్ఫూర్తిగా తీసుకొని కర్ర సాము నేర్చుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ వడ్నాల శ్రీనివాస్, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల తిరుమల, కౌసల్య, మౌనిక మరియు కర్ర సాము సాధకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *