# Tags
#తెలంగాణ

ఫోన్ టాపింగ్ కేసుకు భయపడుతున్న కెసిఆర్ : మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య

ఎల్లారెడ్డిపేట : సంపత్ పంజా :

ఫోన్ టాపింగ్ కేసులో శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాత బస్టాండ్ లో పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ…. సిట్ కు  కేసిఆర్ భయపడుతున్నారని అన్నారు. ఈ కేసులో కేసిఆర్ కు శిక్ష తప్పదని బిఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడిపోయాయని అన్నారు.

ఈ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు తప్పదని భిఆర్ఎస్ శ్రేణులు క్రింది స్థాయిలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్కే సాహెబ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి చెన్ని బాబు నందికిషన్ బండారి బాల్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాస్ యాదవ్ లక్ష్మారెడ్డి బాలయ్య తిరుపతిరెడ్డి మహేందర్ తిరుపతి భాగ్యరాజ్ బాబు బాలు యాదవ్ ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *