# Tags
#తెలంగాణ

కోనరావుపేట మండల బిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ!

రాజన్న సిరిసిల్ల జిల్లా : సంపత్ పంజా

కోనరావుపేట మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ,ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ నర్సయ్య

కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలలోని కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ ఛైర్మన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ బండ నర్సయ్య,వట్టిమల్ల మాజీ సర్పంచ్,మాజీ ఎంపీటీసీ దర్శనాల శంకరయ్య తదితరులతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ..

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..

ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య మాట్లాడుతూ. …తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బీసీ బిడ్డ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు..

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వేములవాడ నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడని వారి నాయకత్వంలో పని చేస్తూ ముందుకు పోతామన్నారు..

కోనరావుపేట మండల బిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ!