# Tags

కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా గుర్తించాలి:మాజీ మంత్రి జీవన్ రెడ్డి


…. బాపూజీ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి
ప్రాంతమా, పదవా అంటే.. ప్రాంతానికే ప్రాధాన్యమన్నారు
జాతిపితగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపా
దశాబ్దాల పోరాటానికి ..నిలువెత్తు నిదర్శనం
తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది బాపూజీ యే
….. మాజీ మంత్రి జీవన్ రెడ్డి

తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చడంతో పాటు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో రాయికల్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం,ఉపాధ్యక్షులు దాసరి గంగాధర్,ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్, కోశాధికారి ఆడెపు నర్సయ్య,యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,పోపా సంఘం దాసరి రామస్వామి, మండల బాధ్యులు గాజేంగి అశోక్ , యువజన సంఘం ఉపాధ్యక్షులు సింగని సతీష్, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,మాజీ అధ్యక్షులు మ్యాకల కాంతారావు,ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్,సంఘం సభ్యులు మ్యాకల రమేష్, వాసం దిలీప్,గుట్ట సత్యనారాయణ, భూమేశ్వర్,రాజేశం,మచ్చ శేఖర్ , లక్ష్మీనారాయణ ,
, మధు,సింగని శ్యాం,మాచర్ల మారుతి,ఆనందం, అశోక్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొని నివాళులార్పించారు.

ఆదివారం రాయికల్ పట్టణంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి దొరకాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారన్నారు.తొలి దశ తెలంగాణ ఉద్యమంలో బాపూజీది కీలక పాత్ర అని, తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి ఆయన తన నిరసన స్వరం వినిపించారని తెలిపారు.

90 ఏళ్ల వయస్సులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయమని చెప్పి మాటకు కట్టుబడి చివరి నిమిషం వరకు చిత్తశుద్ధితో ఉద్యమించారని గుర్తు చేసారు.నిజం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం,చేనేత సహకార ఉద్యమం,1969 లో తొలి దశ తెలంగాణ ఉద్యమం లాంటి నాలుగు రకాల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఉద్ఘాటించారు.

అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది అని వివరించారు.

కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆరంభంలో ఉద్యమానికి మద్దతుగా కేంద్ర కార్యాలయం ఏర్పాటుకు కొండా లక్ష్మణ్ తన భవనాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.

బాపూజీ నికార్సైన గాంధేయవాది అని, కాంగ్రెస్ రాజకీయాల్లో ఎదిగినప్పటికీ తెలంగాణ ఆకాంక్ష కోసం మంత్రి పదవిని లెక్క చేయలేదని నైజాం స్టేట్ లో తెలంగాణ పద్మశాలి సంఘం స్థాపించి ఉద్యమించారని తెలిపారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ 1952 నాన్ ముల్కీ ఆధీన ఉద్యమంలో పోరాటం చేశారన్నారు.ప్రాంతమా.. పదవా అంటే.. ప్రాంతానికే తన ప్రాధాన్యమని చాటిచెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి అన్నారు.

గాంధీజీ మాదిరిగా శాంతియుత పోరాటంలో తెలంగాణ బాపూజీ గా గుర్తింపు పొందారని అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల వారికి వారధిగా నిలిచారని కొనియాడారు.