# Tags
#తెలంగాణ

పచ్చని పంట పొలాలలో “కొండపల్లి ప్రేమకథ”  షార్ట్ ఫిల్మ్ షూటింగ్

పచ్చని పంట పొలాలు – చక్కటి నటీనటులు…చూడ చక్కని పాటల నృత్యాలతో “కొండపల్లి ప్రేమకథ”  షార్ట్ ఫిలిం షూటింగ్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని చక్కటి వాతావరణం నడుమ పచ్చని పంట పొలాలలో శనివారం రోజున… “కొండపల్లి ప్రేమకథ”  షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరిగింది.

కథ, మాటలు, దర్శకత్వం వహిస్తున్న నంగునూరు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. వివిధ రకాల  వేషధారణ, జానపదాల ఆటలు, పాటల షూటింగ్ చూడడానికి వచ్చిన ప్రజలను ఎంతగానో  ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పోతు సత్యం, రఘు వివిధ జిల్లాల నుండి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు.