# Tags

కేటీఆర్ విమర్శలు మానుకోవాలి :కాంగ్రెస్ నాయకులు..

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా):

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగసముద్రం సందర్శించిన సందర్భంగా కేటీఆర్ చేస్తున్న విమర్శలు మానుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగసముద్రం పరిధిలోని ఏడు గ్రామాలలో 2500 ఎకరాల భూమికి జీవనాధారంగా ఉందన్నారు.

పూర్తిస్థాయి నీటిమట్టం రావడంతో అలుగులు పారుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించడం జరిగిందన్నారు. గంభీరావుపేట మండలంలోని నర్మాలలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.గతంలో 15 సంవత్సరాలు అధికారంలో ఉండి తొమ్మిదవ ప్యాకేజీ పను లను పూర్తి చేయలేని అసమర్ధ ఎమ్మెల్యేగా మిగిలిపోవడం జరిగిందన్నారు.

నర్మాల ప్రాజెక్టు కింద లింగన్నపేట వద్ద బ్రిడ్జిలు కట్టక ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు దాపురించాయని అన్నారు.

ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తూ ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యమంత్రిని విమర్శించడం అదేపనిగా పెట్టుకోవడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాలం పుష్కలంగా అవుతుందని గత రెండు సంవత్సరాల నుండి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి సింగసముద్రానికి హారతినిచ్చి పూలు జల్లి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం,వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,మాజీ సర్పంచులు కొండాపురం బాల్ రెడ్డి,పడిగల రవీందర్, నాయకులు లింగం గౌడ్,గిరిధర్ రెడ్డి, చెన్ని బాబు., కల్లూరి బాపురెడ్డి, మెండి శ్రీనివాస్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, అంతర్పుల గోపాల్ ,గుర్రం రాములు ,కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, జజ్జరి దేవేందర్, వెంకటేష్ గౌడ్,గంట రమేష్,అందె బాలయ్య ,మైబుబు, రామ్ చందర్. తదితరులు పాల్గొన్నారు