# Tags
#తెలంగాణ

మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులకు కెటిఆర్ పరామర్శ

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవటంపై కేటీఆర్ ఆవేదన చెందారు.ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచన చేసారు. మిగతా విద్యార్థుల తల్లితండ్రులకు గర్భశోకం మిగల్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్లు ప్రకటన చేసారు..