# Tags

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డా.సాజిదా ఖాన్ 

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డాక్టర్ సాజిదా ఖాన్ 

జగిత్యాల :

తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, జగిత్యాల యునైటెడ్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మంది ప్రముఖులకు జిల్లా కేంద్రం లోని ఏఆర్ గార్డెన్స్లో శనివారం తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారాలు ప్రధానం చేశారు.యునైటెడ్ సొసైటీ చీఫ్ ఆర్గనైజర్ మహమూద్ అలీ అఫ్సర్,  చీఫ్ అడ్వైజర్లు ఖాన్ జియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి మహిళా సంగీత సాంకేతిక నిపుణురాలు(ఆడియో ఇంజనీర్) కుమారి డాక్టర్ సాజిదా ఖాన్ 

తెలంగాణ మైనారిటీ కమిషన్ ఛైర్మెన్ తారిఖ్ అన్సారీ,  తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ సభ్యులు తాహెర్ బిన్ హమ్దాన్ చేతులమీదుగా 

 తెలంగాణ టాలెంట్ & ఇన్‌స్పిరేషన్ అవార్డు-2024 ను అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతోనిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మైనారిటీ నాయకులు, అవార్డ్ గ్రహీతలు పాల్గొన్నారు.