# Tags

కలెక్టరేట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి:కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
రాజన్న సిరిసిల్ల జిల్లా( తెలంగాణ రిపోర్టర్,సంపత్ కుమార్ పంజ)
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐ .డి. ఓ.సి. లో నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ మరియు అధికారులు పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజ మనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.