# Tags

“BuildNow” నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్, లేఅవుట్ ఆమోద వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

బిల్డ్‌నౌ పేరిట నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్ మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ :

బిల్డ్‌నౌ పేరిట, తెలంగాణ కోసం నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్ మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది.

కొత్త సిస్టమ్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించిన అనంతరం… కొత్త సిస్టమ్ బిల్డ్‌నౌ ప్రకారం స్క్రూటినీ ప్రాసెసింగ్ సమయం…వారాల నుండి నిమిషాలకు తగ్గించబడుతుందని వివరించారు.

ప్రస్తుతం ఉన్న TGbPASS సిస్టమ్ పరిశీలనకు దాదాపు 30 రోజులు పడుతుందన్నారు.

ఎత్తైన భవనాలకు అనుమతులు 21 నుండి 15 రోజులకు తగ్గుతాయనీ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీని 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించనున్నారని వెల్లడించారు.

ఈ కొత్త వ్యవస్థ ఫిబ్రవరి 1, 2025 నుండి ప్రజలకు అందుబాటులో ఉంటుందని రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.

“BuildNow” నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్, లేఅవుట్ ఆమోద వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు