# Tags
#తెలంగాణ

మంథనిలో విధుల బహిష్కరించిన న్యాయవాదులు

మంథని :

  • మంథని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి మూల స్వాతి గౌడ్ కు బార్ అసోసియేషన్ నాయకులు వినతి పత్రం

హైదరాబాదులో న్యాయవాది ఇజ్రాయిల్ ను దారుణంగా హత్య చేసిన సంఘటనపై నిరసన తెలుపుతూ మంథనిలో న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు.

రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపు మేరకు మంథనిలో న్యాయవాదులు అందరూ కలిసి ఇజ్రాయిల్ మృతికి సంతాపం తెలుపుతూ విధులను బహిష్కరించామని తెలిపారు.

న్యాయవాదులపై దాడులు జరగడంతో పాటు హత్యలకు పాల్పడుతున్నారని న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ, మంథని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి మూల స్వాతి గౌడ్ కు బార్ అసోసియేషన్ నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, ఉపాధ్యక్షుడు రఘౌత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సహేందర్ రెడ్డి, కోశాధికారి ఆంజనేయులు, న్యాయవాదులు శశికాంత్ కాచే, రమేష్ బాబు, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్, శశిభూషణ్ కాచే, జంజర్ల శేఖర్, ఆర్ల నాగరాజు, సుభాష్, శ్రీనివాస్, వెంకటరామ్ రెడ్డి రాచర్ల రాజేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు