# Tags

చలో బీసీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గం నాయకులు

న్యూఢిల్లీ ( తెలంగాణ రిపోర్టర్)

చలో బీసీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గం నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ బీసీల పక్షాన పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి లు ఈ పోరాటంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని ఉద్యమం ప్రారంభమైందని తెలంగాణలో జరిగే స్థానిక ఎన్నికలలో తెలంగాణ బీసీ బిడ్డలు ఈ విజయం సాధించడం ఖాయం అన్నారు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ చక్రధర్ రెడ్డి వీర్నపల్లి మండలం అధ్యక్షుడు భూతా శ్రీనివాస్ ఓరగంటి నర్సయ్య బాలకృష్ణ శేఖర్ జీవరామకృష్ణ గోనే ఎల్లప్ప పాల్గొన్నారు