# Tags

అక్రమ ఇసుక ర వాణా ఎవరు చేసినా, ఉపేక్షించకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయి :ఎస్ ఐ బోయిని సౌజన్య

మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణాను నిలువ చేస్తూ తోటపల్లి గ్రామ శివారులో డంపుల గా ఉన్న ఇసుకను బెజ్జంకి ఎస్ ఐ బోయిని సౌజన్య సోమవరం రోజున స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

అక్రమ ఇసుక ర వాణా ఎవరు చేసినా, ఉపేక్షించకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరించారు . ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ నూతన గృహాలకు ప్రభుత్వ ఆదేశానుసారము, వారికి ఇసుకను రెవెన్యూ అధికారుల ద్వారా లబ్ధిదారులకు అనుమతులు ఇచ్చి, ఇసుకను అందించడం జరుగుతుంది కానీ ఇసుక రవాణా చేయు వ్యక్తులు అనుమతులకు విరుద్ధంగా ఇసుకను ఎక్కువగా తరలిస్తున్నారనీ,ఇట్టి వారిని చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాటుపడుతున్నట్లుగా భావించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందన్నారు.

అనుమతి తీసుకున్న ఇసుకను ఇందిరమ్మ లబ్ధిదారులు వెంట ఉండి తీసుకువెళ్లాలనీ, ఇసుకకు సంబంధించిన అనుమతుల రసీదును వెంట ఉంచుకోవాలని సూచించారు. తిరిగి ఇసుకను తెచ్చిన వారికి ఇవ్వకూడదని, ఇసుకను తరలించే వ్యక్తులు వారి ట్రాక్టర్లకు నంబర్లు ట్రాలీకి ఇంజనుకు తప్పకుండా ఉండాలనీ, మరియు లైసెన్స్ కలిగిన వ్యక్తులచే ట్రాక్టర్లను నడిపించాలన్నారు. అనుమతి పొందిన ట్రాక్టర్ యజమానులు ఉదయము 9:00 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఇసుకను తరలించాలి మిగతా సమయాలలో తరలించకూడదు ఒకవేళ ఎవరైనా తరలించినచో అక్రమ రవాణాగా భావించి చర్య తీసుకోబడును. ముఖ్యంగా ఇసుక డంపులు దొరుకుతాయో అట్టి భూమి యజమానిపై చర్యలు ఉంటాయి అన్నారు