# Tags

తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా 15 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 50 సిమెంట్ బస్తాల చొప్పున పంపిణీ చేసిన లింగాల వెంకటేష్ – భార్గవి దంపతులు

బెజ్జంకి : (ముడికే కనకయ్య):

మండల కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, సామాజిక సేవకుడు లింగాల వెంకటేష్ – భార్గవి దంపతులు తమ కుమార్తె చి.“లింగాల విభ” 3 వ పుట్టిన రోజు సందర్భంగా ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 15 మంది కుటుంబాలకు ప్రతీ ఒక్క లబ్ధిదారుకు 50 సిమెంట్ బస్తాలు చొప్పున పంపిణీ చేశారు. ముందస్తుగా ఒక్కో లబ్ధిదారుకు ఆదివారం 15 బస్తాలు అందించగా,మిగతా 35 సిమెంట్ బస్తాలు స్లాబ్ వేసే రోజు పంపిణీ చేయనున్నారు.

ఈ సందర్భంగా లింగాల వెంకటేష్ మాట్లాడుతూ తన కుమార్తె చి. విభ పుట్టినరోజు సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 50 సిమెంట్ బస్తాలు పంపిణీ చేయటం ఆనందంగా ఉందని తెలిపారు.

లబ్ధిదారులు మాట్లాడుతూ లింగాల వెంకటేష్ కుమార్తె పుట్టినరోజు రోజు సందర్భంగా తమకు సిమెంట్ బస్తాల పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారి కుమార్తె ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కాంక్షించారు.