# Tags
#తెలంగాణ #జగిత్యాల

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం


రాయికల్ : S. Shyamsunder

మున్సిపల్ పరిధిలో గల 2, 8 అంగన్వాడీ కేంద్రాలలో ప్రీస్కూల్ పిల్లలకి అక్షరాభ్యాసం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ రెండు సంవత్సరాల ఆరు నెలలు నిండిన పిల్లలని కచ్చితంగా అంగన్వాడి సెంటర్ కే పంపాలని వారి మెదడుపై ఒత్తిడి పడకుండా సులువుగా అక్షరాలు నేర్చుకోవడం, అంకెలు నేర్చుకోవడం బొమ్మలతో అక్షరాలను గుర్తుపట్టడం పదాలను పలకడం సులువుగా నేర్పడం జరుగుతుందన్నారు .

పిల్లలకి ఒత్తిడితో చదువు నేర్పినచో వారి జ్ఞాపకశక్తి తగ్గుతుందని సులువుగా నేర్చుకునే విధానంలో మేధాశక్తి ఎక్కువగా ఉంటుందని అందువలన పిల్లలను అంగన్వాడికే పంపాలని సూచించారు. పిల్లలు బరువు తక్కువ ఉండి అనారోగ్యానికి గురి అయినచో వారికి సరియైన పోషకాహారంతో పాటు సలహాలు, సూచనలు అందిస్తూ అంగన్వాడీ టీచర్ అమ్మలాగా లాలిస్తూ పిల్లలను మెరుగుపరచడానికి అండగా ఉంటుందన్నారు. అంగన్వాడి నుండి స్కూల్ కి వెళ్ళిన పిల్లలు మెదడు చాలా చురుగ్గా ఉంటుందని అందరికన్నా చదువులో ముందుంటారని తెలిపారు.

అంగన్వాడి సేవలు తప్పకుండా ప్రతి కుటుంబం నుండి అందుకోవాలని ప్రతి పిల్లలని అంగన్వాడికే పంపాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఎం పద్మ యు రమాదేవి అంగన్వాడి ప్రీస్కూల్ పిల్లలు మరియు తల్లులు పాల్గొన్నారు.