# Tags

కుల బహిష్కరణ ఎత్తివేయించండి మహాప్రభో!

ఐదు కుటుంబాలకు కుల బహిష్కరణ
తెలంగాణ రిపోర్టర్ జాతీయ దినపత్రిక…..కామారెడ్డి జిల్లా ప్రతినిధి.:

కులాంతర వివాహం చేసుకున్నందుకు ఐదు కుటుంబాలను గత మూడేళ్లుగా కుల బహిష్కరణ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మాచారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మాచారెడ్డి మండల కేంద్రంలోని బంగ్ల రాజేందర్ కూతురు 26 నవంబరు 2021 న కులాంతర వివాహం చేసుకుందని అమ్మాయికి చెందిన ఐదు కుటుంబాలని మాచారెడ్డి గౌడ కులసంఘ పెద్దలు బహిష్కరించారు. ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాని తమ ఐదు కుటుంబాలను బహిష్కరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఐదు కుటుంబాలతో ఎవరు మాట్లాడినా, వారిని మంచికి చేడుకు పిలిచినా ఆ కుటుంబానికి 50 వేల జరిమానా విధిస్తామని కులసంఘ పెద్దలు తీర్మానం చేసినట్టు తెలిపారు. 2021 నుండి ఇప్పటి వరకు సంఘంలో మంచి చెడులకు తమ కుటుంబ సభ్యులకు పిలవడం లేదని తమ కుటుంబ సభ్యులు మానసికంగా ఆవేదనకు గురవుతున్నామని తెలిపారు. ఈ విషయంకు సంబంధించి గత రెండు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఎలాంటి పరిష్కారం జరగలేదని బాధితులు తెలిపారు. తిరిగి ఈ నెల 23 న మరో మారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వాణిలో పిర్యాదు చేసినట్టు తెలిపారు. మాచారెడ్డి గౌడ సంఘం ఆస్తుల్లో తమ భాగస్వామ్యం తమకు ఇచ్చి సంఘంలో కలుపుకోవాలని బాధితులు కోరుతున్నారు.