# Tags
#తెలంగాణ

గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పని సరిగా పాటించాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : (sampath. p)

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమర్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.శుక్రవారం రోజున పట్టణ పరిధిలోని పలు గణేష్ మండపాలను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు.

నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదని ,నిర్దేశించిన సమయా నికి నిమర్జనం పూర్తి చేయాలని,మండపాల నిర్వహకులు పోలీస్ సలహాలు ,సూచనలు తప్పక పాటించాలని,ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.

ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ, సిబ్బంది ఉన్నారు.