వినియోగదారుల ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తున్న గాయత్రి బ్యాంకు సేవలపట్ల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హర్షం

-మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 50వ శాఖను ప్రారంభించిన కలెక్టర్ కుమార్ దీపక్ IAS

అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ, వినియోగదారుల ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తున్న ది గాయత్రి బ్యాంకు అందిస్తున్న సేవలపట్ల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 50వ శాఖను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి బి.సంజీవ రెడ్డి మరియు జిల్లా లీడ్ మేనేజర్ కె.తిరుపతి పాల్గొని బ్యాంకు యొక్క వివిధ విభాగాలను ప్రారంభించారు.బ్యాంకు సీ ఈ ఓ వనమాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పుర ప్రముఖులు, వ్యాపారులు, సహకార అధికారులు, బ్యాంకు పాలక వర్గ సభ్యులైన ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, ఎమ్. సౌజన్య, ఎ.రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, జి.గంగాధర్, వి.మాధవి, ఆర్. సతీష్, ఎస్. రవి కుమార్ మరియు ఇతర సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన గాయత్రి బ్యాంకు తనదైన శైలిలో కృషిచేస్తూ, మల్టీస్టేట్ బ్యాంకుగా రూ. 2939.45 కోట్ల వ్యాపారాన్ని సాధించడంతో పాటుగా 50 బ్రాంచీలతో తెలంగాణలోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో అతి పెద్ద బ్యాంకుగా అవతరించి కో-ఆపరేటివ్ వ్యవస్థలో అగ్రగామిగా నిలవడం హర్షించదగ్గ విషయమన్నారు.

అలాగే బ్రాంచీల విస్తరణ ద్వారా బ్యాంకులు ప్రజల ఆర్థిక పరిపుష్టికి కారణమవుతాయని, ప్రజలు బ్యాంకులో ఖాతా తెరచి లావాదేవీలను నిర్వహించుకోవడం ద్వారా ఆర్ధిక క్రమశిక్షణతో పాటుగా కుటుంబ ఆర్ధిక స్థితిగతులు మెరుగవుతాయని అన్నారు. నస్పూర్ ప్రాంత ప్రజలు కూడా బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకోవాలని అన్నారు.

జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి మాట్లాడుతూ, నస్పూర్ యందు గాయత్రి బ్యాంకు శాఖను ప్రారంభించుకోవడం, సహకార వ్యవస్థలో కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా పనిచేస్తూందన్నారు. 24 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 50 బ్రాంచీలతో, 7 లక్షల 39 వేల మంది వినియోగదారులను కలిగి బ్యాంకు అన్ని విధాలుగా మంచి అభివృద్ధిని సాధించిందని అన్నారు.

గాయత్రి బ్యాంక్ మంచిర్యాల యందు గత 11 సంవత్సరాలుగా పనిచేస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతుందని… నస్పూర్ శాఖ కూడా మంచి అభివృద్ధిని సాధిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి కె.తిరుపతి మాట్లాడుతూ, బ్యాంకు యందు మొబైల్ బ్యాంకింగ్, ఎఇపిఎస్, యు.పి.ఐ, ఎ.టి.ఎమ్ సర్వీసులు, ఆర్.టి.జి.ఎస్ వంటి టెక్నాలాజికల్ సేవలతో పాటుగా, నిరక్షరాస్యులకు సహాయకంగా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటుచేయడం, ఖాతాదారులకు అవసరమైన ఫోటో మరియు జిరాక్స్ కాపీలను బ్యాంకులోనే ఉచితంగా అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ..సామాన్య మధ్యతరగతి, వర్తక వాణిజ్య వర్గాల ప్రజలకు… కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా సేవలందించడమే బ్యాంకు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
ఆన్లైన్ సేవలతో పాటుగా అధునాతన డిజిటల్ సేవలను అందిస్తున్నామని, గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా ద్వారా 1 లక్ష రూపాయల ప్రమాదభీమా సౌకర్యాన్ని అందిస్తున్నామని, వర్తక, వ్యాపార, ఉద్యోగులకు కావలసిన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను సత్వరంగా అందించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇట్టి సేవలను, నస్పూర్ కాలనీ వాసులు వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని కోరారు. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి మరో 16 బ్రాంచీలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తద్వారా 66 బ్రాంచీలకు చేరుకుంటామని వెల్లడించారు.

బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీమతి శ్రీలత మాట్లాడుతూ మా వంతు సామాజిక బాధ్యతగా బ్యాంకు యందు సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ఇట్టి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన 566 మంది ఖాతాదారుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవడం జరిగిందని అన్నారు.

సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాదారులైన పోట్ట గట్టయ్య యొక్క కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయల చెక్కును మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతులమీదుగా అందజేశారు.

రీజనల్ మేనేజర్ బింగి తిరుపతి మాట్లాడుతూ.. వినియోగదారులు తమపై చూపిస్తున్న ఆదరాభిమానాల వల్ల బ్యాంకును మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని అన్నారు.నస్పూర్ వాసులు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్ నంబరు ద్వారా నగదు బదిలీ పథకం క్రింద వచ్చు సబ్సిడీ బదలాయింపులను, ప్రభుత్వ పెన్షన్లను పొందవచ్చని వివరించారు. బంగారు ఆభరణాలపై ఋణాలను అందజేస్తామని, వ్యాపారులకు ఆస్థి తనఖాపై ఋణ సౌకర్యం కల్పిస్తామని, వినియోగదారులు బ్యాంకును ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. ఋణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేవని, డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తున్నామని వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *